స్నేహబంధానికి ఆపన్నహస్తం ..ఆదర్శంగా నిలిచిన పూడూరు 2001-02 బ్యాచ్ విద్యార్థులు
నవగీతం, కొడిమ్యాల: కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల రోజుల్లో పంచుకున్న జ్ఞాపకాలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా,కష్టకాలంలో తోటి మిత్రులకు అండగా నిలిచే శక్తిగా మారవచ్చని పూడూరు ప్రభుత్వ పాఠశాల 2001-02 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు నిరూపించారు.గెట్-టుగెదర్’ కార్యక్రమంలో పాత మిత్రులంతా ఒకచోట చేరి చిన్ననాటి స్మృతులను నెమరవేసుకున్నారు. ఆనందోత్సాహాల మధ్య సాగిన ఈ కార్యక్రమం కేవలం విందు, వినోదాలకే పరిమితం కాకుండా తమ బ్యాచ్‌లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు చేయూతనివ్వాలని నిర్ణయించిన విద్యార్థులు, స్వచ్ఛందంగా నిధులు సేకరించారు. ఈ...