navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 2:21 pm Digital Edition : NAVAGEETAM

స్పీకర్‌ను అవమానించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్కా కమలాకర్

మల్లాపూర్,సెప్టెంబర్8,(నవగీతం):తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత కలిగిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాత మధు.. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై దుర్భాషలాడడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్కా కమలాకర్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఎల్కా కమలాకర్ మాట్లాడుతూ.. శాసనసభ స్పీకర్ పదవి పట్ల ప్రతి ప్రజాప్రతినిధి గౌరవం, సంయమనం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. సభా వ్యవహారాల్లో అభిప్రాయ భేదాలు సహజమే అయినప్పటికీ, స్పీకర్‌ను వ్యక్తిగతంగా దూషించడం, అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.కేవలం దళితుడు అనే కారణంతోనే స్పీకర్‌పై అవమానకర ధోరణితో వ్యవహరిస్తే అది మరింత ఆందోళనకరమైన విషయమని ఎల్కా కమలాకర్ అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ గౌరవాన్ని కాపాడటం శాసనసభలోని ప్రతి సభ్యుడి బాధ్యత అని పేర్కొన్నారు.119 మంది ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తూ సభను నడిపించే స్పీకర్ పదవికి తగిన గౌరవం ఉండేలా చూడాలని,సభా మర్యాదలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు, సభ గౌరవం,రాజ్యాంగ విలువలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు అత్యంత కీలకమైనవని అన్నారు. వాటిని కాపాడేందుకు రాజకీయ నాయకులందరూ కట్టుబడి ఉండాలని ఎల్కా కమలాకర్ సూచించారు.