స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్: డిఎస్పి రాములు

నవగీతం,జగిత్యాల ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మెట్ పల్లి పట్టణంలో  ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మెట్ పల్లి డిఎస్పి రాములు మాట్లాడుతూ ప్రతి ఓటరు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. శాంతి భద్రతకు ప్రాధాన్యమిస్తూ, ఓటర్లలో నమ్మకం పెంపొందించడం మా ప్రధాన ఉద్దేశం ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడానికి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన...