navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 2:11 pm Digital Edition : NAVAGEETAM

హనుమాన్ జయంతి ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు  ఆహ్వానం

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న మహత్తర హనుమాన్ జయంతి ఉత్సవాలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ను ఆలయ ఈఓఎస్ అంజనారెడ్డి భక్తిపూర్వకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా వరంగల్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కొండగట్టు దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి ఎస్ అంజనారెడ్డి, ఉత్సవాల ఆహ్వాన పత్రికను సమర్పించి, భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న హనుమాన్ జయంతి వేడుకలకు విచ్చేయవలసిందిగా కోరారు. హనుమాన్ జయంతి ఉత్సవాలను 2026 మే 10 నుండి 12వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. భక్తుల సమక్షంలో ఆధ్యాత్మిక వైభవంతో ఈ వేడుకలు జరుగనున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానాచారి కపిందర్, వేదపండితులు తేజాశర్మ, సూపరింటెండెంట్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.