హనుమాన్ మాల వేసుకున్న విద్యార్థులకు నో ఎంట్రీ…

మెట్‌పల్లి ప్రైవేట్ పాఠశాల వద్ద ఉద్రిక్తత నవగీతం, మెట్ పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో హనుమాన్ మాల వేసుకున్న విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణానికి చెందిన నిఖిల్ భరత్ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. హనుమాన్ దీక్ష తీసుకున్న ఐదుగురు విద్యార్థులను పాఠశాల యాజమాన్యం తరగతులకు అనుమతించకపోవడంతో వివాదం చెలరేగింది.ఈ విషయం తెలుసుకున్న హనుమాన్ మాలధారులు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకొని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల మతాచారాలను గౌరవించకుండా ఇలా ప్రవర్తించడం సరైంది...