navageetam.com
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 7:17 pm Digital Edition : NAVAGEETAM

హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన డాక్టర్ రఘు

నవగీతం, మెట్ పల్లి

ఈ నెల జులై 19 న మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలో జరగనున్న హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఏర్పాట్లను నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రఘు పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, పార్కింగ్, భద్రత, పరిశుభ్రతతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను సమకూర్చాలని సూచించారు. జూలై 19న నిర్వహించే హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ రఘు కోరారు.ఈ పరిశీలన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.