హమాలీల ఆరోగ్య రక్షణకు జగిత్యాల పాక్స్ ముందడుగు.
వరిధాన్య కొనుగోలు కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ల పంపిణీ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ (పాక్స్ ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్య కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాక్స్ చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందజేశారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో హమాలీలు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు సేవలు అందిస్తున్న...