ఉపాది హామీ పథకం పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష
కూలీలకు సమయానికి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి నవగీతం, జగిత్యాల/ మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శనివారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంపుపై ప్రత్యేకంగా చర్చించారు. గ్రామాల్లో మరిన్ని కూలీలను ఉపాధి హామీ పనుల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో పనుల అందుబాటును పెంచాలని ఆదేశించారు. పనుల ఎంపికలో పారదర్శకత పాటించాలని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పారు.పనుల...