హిందువుల భవిష్యత్తు తరాల రక్షణకోసమే గిరిప్రదక్షిణ
ఘనంగా 39,వ కొండగట్టు గిరిప్రదక్షిణ హిందువులు కలిసి ఒకటిగా నడుస్తున్నారు: శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ జీ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టులో ప్రతీ పౌర్ణమి రోజున నిర్వహించే 39వ గిరిప్రదక్షిణ కార్యక్రమం గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతీ పౌర్ణమి రోజున గిరిప్రదక్షిణ చేయాలనే సంకల్పంతో 2023 ఫిబ్రవరి 5న మాఘ పౌర్ణమి రోజున ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక గిరిప్రదక్షిణ పాదయాత్ర నిరాటకంగా కొనసాగుతోంది. గురువారం పౌర్ణమి, శ్రీహనుమాన్ చిన్న జయంతి కావడంతో మాలధారణ శ్రీహనుమాన్...