navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 8:27 am Digital Edition : NAVAGEETAM

హిందూ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ

నవగీతం ,కోరుట్ల ప్రతినిధి :

కోరుట్ల పట్టణ కేంద్రంలో మే1వ ,తేదీ శుక్రవారం నాడు శ్రీ దుర్గా దేవాలయం (కాలేజ్ గ్రౌండ్) లో జరిగే హిందూ సమ్మేళన కరపత్ర ఆహ్వాన పత్రికను ఆర్ ఎస్ ఎస్ జిల్లా సహా వ్యవస్థ ప్రముఖ్ గట్ల శివకుమార్, బస్తీ ప్రముఖ్ గంగదారి రోహన్, బస్తీ అధ్యక్షులు మానుక రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బస్తీ అధ్యక్షులు మనూక రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..గడపలోపే కులం-గడపదాటితే హిందువులం మనం అందరం ..కావున కులాలకు అతీతంగా కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సమ్మేళనంకు అనుగ్రహా భాషణం శ్రీశ్రీశ్రీ విశోక తీర్థ స్వామిజీ ,ప్రధాన వక్త శ్రీ గుండు సాయి సుధాకర్  వస్తున్నారు. కావున ప్రతి హిందువు కుటుంబ సమేతంగా వచ్చి మన హిందువుల బలాన్ని , ఐక్యతను చాటుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బస్తీ ప్రముఖులు హిందూ సోదరులు తదితరులు పాల్గొన్నారు