navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 4:52 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి

నవగీతం,ఆగస్టు7,(నవగీతం) జగిత్యాల జిల్లా కోరుట్ల ఇంటలిజెన్స్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుళ్లు వావిలాల గంగాధర్, అబ్దుల్ రషీద్‌లు ఏఎస్ఐలుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా శుక్రవారం కరీంనగర్ ఆర్‌ఐఓ మోహన్ వారిని శాలువాలతో సత్కరించి పదోన్నతి స్టార్ లను అలంకరించి అభినందించారు.అలాగే జగిత్యాల జిల్లా జోనల్ ఇన్‌స్పెక్టర్ బాణాల రాజేందర్,ఇంటలిజెన్స్ విభాగం రిటైర్డ్ ఎస్సై వెంకన్నలు పదోన్నతి పొందిన గంగాధర్,అబ్దుల్ రషీద్‌లను అభినందించారు.ఈ సందర్భంగా వారు నూతన బాధ్యతల్లో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.