navageetam.com
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 1:48 pm Digital Edition : NAVAGEETAM

13 వార్డు కౌన్సిలర్ బరిలో మాదినేని నాగరాణి

నవగీతం, వైరా

వైరా పట్టణానికి చెందిన మేడిది సుబ్బయ్య ట్రస్ట్ సూర్యోదయ సామాజిక సేవా సంఘం సభ్యురాలు మాదినేని నాగరాణి 13వ వార్డు జనరల్ మహిళ కావడంతో ఆమె వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. సామాజిక స్పృహ కలిగిన నాగరాణి వైరా మున్సిపాలిటీ పరిధిలో హెల్త్ క్యాంపులు ట్రస్టు ద్వారా అన్నదాన కార్యక్రమాలు కోవిడ్ సమయంలో ఎంతోమందిని ఆమె ఆదుకున్నారు. ఇదే స్ఫూర్తితో ఆమె సేవ కార్యక్రమాలకు ముందున్నారు. బిఆర్ఎస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ 2023 ఎన్నికల్లో మదన్ లాల్ గెలుపుకు భర్త లక్ష్మణరావు తో కలిసి ఎంతో కృషి చేశారు అలాగె 13 వార్డు ప్రజలతో ఆమెకు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో 13వ వార్డులో బిఆర్ఎస్ పార్టీతో కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వార్డు ప్రజలు ఆశీర్వదించాలని అన్నారు.