navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 December 2025, 6:43 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అలిపిరి మెట్ల మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభం

నవగీతం, తిరుపతి

తిరుమలలో అలిపిరి మెట్లమార్గంలోని 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు ప్రారంభించారు. వీటితోపాటు  టీటీడీ ఈఓ, అదనపు ఈఓ పాల్గొన్నారు.నడకదారిలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా, అపోలో కార్డియాక్ సెంటర్ సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలకు తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సేవలను తప్పక వినియోగించుకోవాలని కోరారు. టీటీడీ, అపోలో వైద్యులతో పాటు శిక్షణ పొందిన పారామెడిక్స్ బృందం, ఈసిజి యంత్రం, ఆక్సిజన్ కాన్సంట్రేటర్, నెబ్యులైజర్, అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.