navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 December 2025, 1:29 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కొండగట్టులో ఏపి డిప్యూటీ సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం

నవగీతం, జగిత్యాల:

తెలంగాణ లో అత్యంత ప్రతిష్టాత్మక హనుమాన్ దేవాలయం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం లో భక్తుల సౌకర్యార్థం 96 వసతి గదుల నిర్మాణం కోసం ఏ పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో టీటీడీ వారి 35 కోట్ల19 లక్షల నిధులు కొండగట్టు అభివృద్ధి కోసం మంజూరు చేయడంతో జగిత్యాల జిల్లా జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తూ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలభిషేకం చేశారు.ఈ సందర్భంగా నాయకులు పవన్ కళ్యాణ్ కి కొండగట్టు అంజన్న స్వామి పైన ఉన్నటువంటి భక్తి ని తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన ఉన్నటువంటి ప్రేమను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఇంచార్జి బెక్కo జనార్దన్ ,కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా శివా రెడ్డి,బొల్లి రాము, ఎడమల జై పాల్ రెడ్డి,నాచుపల్లి గ్రామ వార్డు సభ్యుడు చిర్ర అరుణ్ కుమార్ నవీన్, సందీప్ ,రాము,రమేష్, తదితరులు పాల్గొన్నారు