navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 December 2025, 1:14 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

క్రీడాతేజాలు కోనేరు హంపి, అర్జున్ ఎరిగైసిలకు ముఖ్యమంత్రి అభినందనలు

నవ గీతం,హైదరాబాద్

2025 ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ (2025 FIDE World Rapid Chess Championship) లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి దేశానికి పతకాలు సాధించిన తెలుగు క్రీడాతేజాలు కోనేరు హంపి, అర్జున్ ఎరిగైసిలకు ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  అభినందనలు తెలిపారు. వార్సా (పోలాండ్) వేదికగా జరిగిన 2025 ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ మహిళల విభాగంలో కోనేరు హంపి కాంస్య పతకాన్ని సాధించగా, తెలంగాణ యువకెరటం అర్జున్ ఎరిగైసి ఓపెన్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్నారు. నైపుణ్యం, పట్టుదలతో హంపి, అర్జున్‌లు సాధించిన విజయం అంతర్జాతీయ చెస్‌లో భారత ప్రతిష్టను మరింత పెంచిందని, దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు ఈ విజయం ప్రేరణగా నిలుస్తుందని ముఖ్యమంత్రి  ఒక సందేశంలో పేర్కొన్నారు. ఇద్దరు ఛాంపియన్లు భవిష్యత్తులో మరిన్ని విజయాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.