గల్ఫ్ సంక్షేమానికి వెయ్యి కోట్లు కేటాయించాలి

నవగీతం, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 2026–27 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించాలని తెలంగాణ గల్ఫ్ వలస కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రానికి చెందిన సుమారు 15 లక్షల మంది కార్మికులు గల్ఫ్ తదితర దేశాల్లో పనిచేస్తూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, గత రెండు సంవత్సరాలుగా వారి సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు లేవని సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. టీపీసీసీ అధ్యక్షుల, ఎమ్మెల్సీ బి. మహేష్ గౌడ్,  మంత్రి వాకిటి శ్రీహరి, బీఆర్ఎస్...