ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నవగీతం, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1885లో స్థాపితమైన కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర్యానికి పునాది వేసిన చారిత్రక పార్టీ అని అన్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్...