navageetam.com
Newspaper Banner
Date of Publish : 31 December 2025, 1:29 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఘనంగా టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు జన్మదిన వేడుకలు

నవగీతం,మెట్ పల్లి

టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజీత్ రావు జన్మదినం సందర్భంగా మెట్ పల్లి పట్టణంలో కాంగ్రెస్ కార్యాలయం లో  కేక్ ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసారు.కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ,ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సహకారంతో కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి టీపీసీసీ నాయకులు కల్వకుంట్ల సుజీత్ రావు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజవర్గంలో అపరిష్కృత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళుతుండడం అభినందనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నుండి ఆయనకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుతున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా పాషా, కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ములచిన్నారెడ్డి, పాతధాంరజ్ పల్లి ఉప సర్పంచ్ ఇప్పపల్లి గణేశ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోడిమ్యాల దీపక్ రాజ్, ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లూరి సాగర్, మామిడి రాజశేఖర్,ఎండి జాఫర్, మొగిలి రాజేందర్,బైండ్ల శ్రీకాంత్, కోరే రాజ్ కుమార్,అయ్యప స్వాములు,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.