నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు

-మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిని కలిసిన తెలంగాణ జర్నలిస్టు సంఘాల జేఏసీ. నవగీతం, హైదరాబాద్ తెలంగాణలో గతంలో ఇచ్చిన మీడియా అక్రెడిటేషన్ కార్డుల కంటే అధికంగానే ఇస్తామని, నిజమైన జర్నలిస్టులకు తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని రాష్ట్ర సమాచార,పౌరసంబధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అక్రిడిటేషన్ల జీవో 252 విషయంలో జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏదైనా పొరపాట్లు ఉంటే త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశమై సవరిస్తామని అన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ జర్నలిస్టు సంఘాల ఐక్య...