navageetam.com
Newspaper Banner
Date of Publish : 31 December 2025, 12:27 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నూతన ప్రెస్ క్లబ్ సభ్యులకు ఘన సన్మానం

నవ గీతం, జగిత్యాల

జగిత్యాల జిల్లా బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఇటీవల ఎన్నికైన జగిత్యాల పట్టణ నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎల్లాల రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందుకూరి శశిదర్ ఉప అధ్యక్షులు ముసిపట్ల దేవేందర్ బద్దెనపల్లె మల్లేశం శనిగరపు శ్రీనివాస్ కోశాఖ అధికారి శ్రీధర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కాడర్ల రంజిత్ సంయుక్త కార్యదర్శి బద్దం నారాయణ రెడ్డి గాజుల మహేష్ కార్యవర్గ సభ్యులు నిరేటి గంగాధర్ ఎల్లా క్రాంతి కుమార్ కల్లెడ హరీష్ సామ మహేష్ వాసం రఘు యం డి సబీర్ కట్కురీ సంతోష్ దండిగల శ్రీనివాస్ లను జగిత్యాల జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్  శాలువా తో ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యం లో నాల్గవ స్తంభం అయిన మీడియా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను, ప్రతి పక్ష పార్టీ లు ప్రజల కోసం చేస్తున్న కృషిని ఎల్లవేళలా సమాజానికి చేరవేస్తున్న మీడియా.. బి ఆర్ యస్ పార్టీ అండగా ఉంటుందని, ప్రెస్ క్లబ్ ఎదురుకుంటున్న సమస్యలకు ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధంగా ఉంటామని ప్రెస్ క్లబ్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అల్లాల ఆనందరావు, వొళ్లెం మల్లేశం, దేవేందర్ నాయక్ రాథోడ్,శీలం ప్రవీణ్, గాజుల శ్రీనివాస్, నీలి ప్రతాప్, కోరుకంటి రాము, అనురాధ, గంగిపెల్లి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.