navageetam.com
Newspaper Banner
Date of Publish : 31 December 2025, 12:02 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పదవి విరమణ సిబ్బందికి ఘన వీడ్కోలు.

నవగీతం, నిజామాబాద్

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31న పదవి విరమణ , స్వచ్ఛంద పదవి విరమణ పొందిన సిబ్బందికి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి .సాయి చైతన్య ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన వారు కె. చందర్ రాథోడ్, సీఐ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సి.హెచ్. ముక్తేశ్వరరావు, ఏఆర్‌ ఎస్‌ఐ, పి.సంజీవ్, హెడ్ కానిస్టేబుల్ , ఆర్. శివకుమార్, హెడ్ కానిస్టేబుల్ (స్వచ్ఛంద పదవి విరమణ)పదవి విరమణ పొందిన సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి .సాయి చైతన్య ఆధ్వర్యంలో ఘనంగా శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు మరియు పదవి విరమణ శుభాకాంక్షల సర్టిఫికేట్లను అందజేశారు. ఈ సందర్భంగా  నిజామాబాద్ కమిషన్.పి .సాయి చైతన్య  వారి సేవలను ప్రశంసిస్తూ, భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.