నవగీతం, కోరుట్ల
కోరుట్ల పట్టణంలో ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. కొండగట్టులో భక్తుల కోసం మండపం, గదుల నిర్మాణానికి టీటీడీ నుంచి రూ.35.19 కోట్లు మంజూరు చేయించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపుతూ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గంగం అజయ్ కుమార్, ఎలాగందుల అజయ్ రాజకుమార్, కిషోర్ కుమార్, మణివర్ధన్, అబ్బూరి ఆనంద్ గౌడ్ అశోక్ కుమార్, శంకర్, నరసయ్య, సాయన్న, రాజేశ్, లక్ష్మణ్, ఆనంద్, అశోక్ తదితరులున్నారు.