navageetam.com
Newspaper Banner
Date of Publish : 31 December 2025, 8:46 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

రీసెర్చ్ అనలిస్ట్ వినయ్ శుక్ల ను సన్మానించిన కలెక్టర్ రాజర్షి షా

నవగీతం ,ఆదిలాబాద్

ఆదిలాబాద్  జిల్లాలోని నార్నూర్ ఆస్పిరేషన్ బ్లాక్ లో భాగంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు పై క్షేత్ర పర్యటనకు వచ్చిన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ ఐఐఎం రీసెర్చ్ అనలిస్ట్ వినయ్ శుక్ల ను బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్ లో అమలవుతున్న అంగన్వాడీ సెంటర్, ఆర్వో ప్లాంట్, న్యూట్రిషన్ గార్డెన్, బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లీష్ లిటిరేచరి ఫౌండేషన్, సైన్స్, ఇంగ్లీష్ ల్యాబ్, విద్యా, వైద్యం, వ్యవసాయం, అంగన్వాడీ కేంద్రం నిర్వహణ, మహిళ సంఘాల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ, తాగునీరు, మౌహ లడ్డు యూనిట్, జేజేఏం, పిఎంఈజిపి, పిఎంఎఫ్ఎంఈ పథకాల అమలును పరిశీలించి అధ్యయనం చేసినట్లు కలెక్టర్ కు రీసెర్చ్ అనలిస్ట్ వివరించారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ అధికారి రాహుల్, తదితరులు పాల్గొన్నారు.