లడ్డూల విక్రయ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు

లడ్డుల కొరత లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. బిఆర్.నాయుడు నవగీతం, తిరుపతి : తిరుమలలోని శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రంలో గురువారం  దేవస్థానం చైర్మన్ బి.ఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లడ్డూ నాణ్యత, బరువు, జారీ విధానం, సిబ్బంది పనితీరును స్వయంగా పరిశీలించడంతో పాటు భక్తుల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించారు. దర్శనం కాని భక్తులకు ఆధార్ నమోదు ద్వారా యూ పి ఐ  చెల్లింపుతో లడ్డూలు పొందే విధానాన్ని, కియోస్క్ యంత్రాల పనితీరును మరియు బూందీ పోటులో లడ్డూ తయారీ ప్రక్రియను కూడా తనిఖీ...