వైకుంఠ ఏకాదశి విశిష్టత

నవగీతం, హైదరాబాద్. వైకుంఠ ఏకాదశినిఎప్పుడుజరుపుకోవాలి. సౌరమానం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడమే ధనుర్మాసం. ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి అనగా ధనుర్మాసం ప్రవేశించాక వచ్చే శుద్ధ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి పర్వదినం. అనగా పవిత్రమైన రోజు. ఆరోజుని భగవంతుని ఆరాధనకే వినియోగించాలి. భక్తులందరూ భగవంతుడిని చేరే పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి. ఆరోజున మూడు కోట్ల దేవతలు స్వామిని కొలుచుకోవడానికి వైకుంఠానికి వచ్చిన రోజు. అందుకే ఇది ముక్కోటి ఏకాదశి. లోకకల్యాణార్థం శ్రీమన్నారాయణుడు యోగనిద్ర నుండి లేచిన రోజు!...