navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 December 2025, 11:59 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

స్టీరింగ్ పట్టండి.. స్వశక్తితో ఎదగండి!

నవగీతం హైదరాబాద్.

హైదరాబాద్‌లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం, హైదరాబాద్ పోలీసుల సహకారంతో డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది.మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.ఉచిత డ్రైవింగ్ శిక్షణ, లైసెన్స్ జారీలో సహాయం.డ్రైవింగ్ అనుభవం లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు .వివరాలకు సెల్: 89788 62299.ఆసక్తి గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.