navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 1:57 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసాన అక్షరభ్యాసం

నవగీతం, కోడిమ్యాల

కొడిమ్యాల మండలం రామకృష్ణాపురం గ్రామంలోని అంగన్వాడి రెండవ కేంద్రంలో అంగన్వాడి టీచర్ ఎలగుర్తి వినోద కిరణ్ ఆధ్వర్యంలో బుధవారం అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ నేరళ్ల మహేష్‌, ఉపసర్పంచ్ బోనుగాని మల్లేష్ యాదవ్‌, వార్డు సభ్యులు హాజరయ్యారు. ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సర్పంచ్ నేరళ్ల మహేష్ ప్రశంసించారు. చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాల్లో ఆయన పాల్గొని పిల్లలను ఆశీర్వదించారు.గ్రామంలో అంగన్వాడి భవనం లేకపోవడంతో అద్దె గృహంలో కేంద్రాన్ని నిర్వహిస్తున్న విషయాన్ని తల్లిదండ్రులు నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన సర్పంచ్ నేరళ్ల మహేష్‌, త్వరలోనే అంగన్వాడి కేంద్రం కోసం భూమి సేకరణ చేపట్టి నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.తదనంతరం గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని, కార్యక్రమంలో పాల్గొన్న వైద్య సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్‌లను అంగన్వాడి టీచర్ ఎలగుర్తి వినోద శాలువాలతో సన్మానించి సత్కరించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గుడి వెంకటరమణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, లింగంపల్లి సురేందర్, గుంటి లక్ష్మీ–తిరుపతి, రేనుకుంట చందన–సాయి, వైద్యాధికారి సీహెచ్‌ఓ హారిక, ఏఎన్‌ఎం సంయుక్త, ఆశా కార్యకర్త లింగంపల్లి లక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ బాలయ్య, అంగన్వాడి ఆయా లింగంపల్లి సునీత, పిల్లలు, తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.