అంత్యక్రియల నిమిత్తం తక్షణ సహాయం చేసిన సర్పంచ్

నవగీతం, మల్లాపూర్ మాల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో బాలపెల్లి లక్ష్మి బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు.  ఇది తెలుసుకున్న సాతారం సర్పంచ్ చెక్కపల్లి కిషన్ గౌడ్ వెంటనే స్పందించి గ్రామపంచాయతీ పాలకవర్గంతో కలిసి వారి కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం తక్షణ సహాయం కింద రూ.5000 నగదు అందజేశారు. ఉప సర్పంచ్ బెతి  జగన్ రెడ్డి గ్రామపంచాయతీకి పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు