అక్షరసూర్యుడు అలిశెట్టి ప్రభాకర్
నవగీతం, హైదరాబాద్ కవిగా,చిత్రకారునిగా,ఫొటోగ్రాఫర్‌గా చివరకంటూ సమాజం కోసమే తండ్లాడిన అక్షరసూర్యుడు అలిశెట్టి ప్రభాకర్. జగిత్యాల జైత్రయాత్ర ప్రభావంతో విప్లవ కవిత్వాన్ని ఆయుధంగా ఎంచుకుని, కష్టజీవి బతుకును సిరాలో నింపి అక్షరాలతో అగ్గి పుట్టించి, కలంతో కవాతు చేసినవాడు . పెన్సిల్‌అబశ్రీశ్రీతో బొమ్మలేసినా, పెన్నుతో కవిత్వం రాసినా అది ప్రజాపక్షమే. పాలకులను ప్రశ్నించడం, అన్యాయాన్ని ఎదిరించడం, సుత్తిలేకుండా సూటిగా చెప్పడం అలిశెట్టి మాదిరి మరొకరికి సాధ్యం కాదు. ఎంతో పెద్ద విషయాన్ని అయిన చిన్నచిన్న పదాలతో చెప్పడం ఆయన ప్రత్యేకత. అతని అక్షరం మండుతున్న అగ్నికణం.....