navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 11:32 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అఖిల భారత ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షులుగా జగదీశ్వర్

సన్మానించిన జగిత్యాల జిల్లా ఉద్యోగ సంఘాల నేతలు

నవగీతం,జగిత్యాల

అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షులుగా ఎన్నికైన టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ ను జగిత్యాల జిల్లా ఉద్యోగుల సంఘాల నేతలు ఘనంగా సన్మానించారు.మారం జగదీశ్వర్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అఖిల భారత ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సందర్బంగా బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఎన్జీఓ భవన్ లో జగిత్యాల జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు మిర్యాల నాగేధర్ రెడ్డి, జగిత్యాల జిల్లా నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు క్యారంగుల అరుణ,కార్యదర్శి యు.నారాయణ, కోశాధికారి సిహెచ్ సతీష్ కుమార్, రాజేశం,రాజశేఖర్ రెడ్డి,మణి తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మాంచి, భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.