నవగీతం, వెంగలపూడి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ వెంగలపూడి సచివాలయం 2వ బ్లాక్ లో అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చిస్తున్నారు. సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ శ్రీమతి శాంతిప్రియా పాండే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు