navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 12:00 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అత్యవసర సమయంలో అరుదుగా దోరికే రక్తాన్ని దానం చేసిన శ్రీధర్.

నవగీతం, మెట్ పల్లి

జగిత్యాల పట్టణంలోని మా కమాఖ్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పావని అను మహిళకు అత్యవసర చికిత్స నిమిత్తం ఏ నెగటివ్ రక్తం అవసరం అని పేషెంట్ కుటుంబ సభ్యులు డోనర్ కోసం వెతుకుతూ రక్తదాతల అనుసంధాన కర్త ఎనుగందుల ఉదయ్ కుమార్ ని సంప్రదించగా జగ్గసాగర్ గ్రామానికి చెందిన బెజ్జరపు శ్రీధర్ కి సమాచారం తెలుపగ శ్రీధర్ వెంటనే స్పందించి బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి రక్తం ఇవ్వడం జరిగింది.అత్యవసర సమయంలో అరుదుగా దోరికే రక్తాన్ని దానం చేసిన శ్రీధర్ ని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, రక్తదాతల అనుసంధాన కర్త ఉదయ్ కుమార్ యువజన సంఘాల సభ్యులు, పేషెంట్ బంధువులు అభినందించారు.