navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 3:05 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అభివృద్ధి పనుల నిమిత్తం స్థల పరిశీలన చేసిన పంచాయతీరాజ్ ఏఈ

నవగీతం, మల్లాపూర్

మల్లాపూర్ మండలం మొగిలిపేట గోదావరి నదితీరంలో పురాతన క్షేత్రమైన మహాదేవుని ఆలయం నందు భక్తుల సౌకర్యార్థం మహాదేవ ఆలయానికి వెళ్లే దారిలో సిసి రోడ్డు, గుడి ప్రాంగణం చుట్టూ ప్రహరీ గోడ, రేకుల షెడ్డు మరియు ఆలయ ప్రాంగణం లోపల సిమెంటు బెడ్డు, గుడి ప్రాంగణంలో హైమాక్స్ లెట్స్  నిర్మాణాలు చేపట్టుటకు పంచాయతీరాజ్ ఏఈ రాగసుధ తో కలిసి మొగిలిపేట గ్రామ సర్పంచ్ గోల్కొండ కళా రమేష్ ఉపసర్పంచ్ దండ వేణి రాజేందర్ స్థల పరిశీలన చేసారు. ఈ యొక్క పనులకు పంచాయతీరాజ్ ఏఈ  సానుకూలంగా స్పందించి కొలతలు తీసుకొని వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి సహకరిస్తామని తెలిపారు