అమరావతిలో పవిత్ర హారతిపై టిటిడి ఈవో సమీక్ష

నవగీతం,తిరుపతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరావతిలో పవిత్ర హారతులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని టిటిడి ఈవో  అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో టిటిడి ఉన్నతాధికారులతో ఈవో సోమవారం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గంగా నది తీరంలోని కాశీలో, ఉజ్జయినిలో నిర్వహిస్తున్న పవిత్ర హారతులతో పాటు ఇతర ప్రాంతాలలో ఎక్కడెక్కడ పవిత్ర హారతులు ఇస్తున్నారో టిటిడి అధికారుల కమిటీ పరిశీలించి నివేదిక రూపొందించాలని కోరారు. వేద మంత్రోచ్ఛారణలు, దీపాల...