navageetam.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 10:48 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.

నవగీతం,ఇల్లంతకుంట

ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట గ్రామంలో గల ఆదర్శ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరానికి (2026 – 2027), 6 నుండి 10 వ తరగతి వరకు ప్రవేశ పరీక్షలకు జనవరి 17 వ తేదీన నోటిఫికేషన్ వెలువడినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ గంగాధర్ తెలిపారు. జనవరి 28 వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వ తేదీ వరకు 6 నుంచి 10 వ తరగతి వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారని, హాల్ టికెట్లను ఏప్రిల్ 9 వ తేదీ నుండి డౌన్లోడ్ చేసుకొనే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 19 న ఆదివారం ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఆరో తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గం వరకు, 7 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గం వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ http://tgms.telangana.gov.in సంప్రదించాలని సూచించారు