navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 10:26 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఇందిర మహిళ శక్తి చీరలు పంపిణీ

ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

నవగీతం,కోడీమ్యాల

కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి, శ్రీరాములపల్లి, నల్లగొండ, తిప్పయపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఇటీవల ఎన్నికైన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లు,వార్డు సభ్యులకు గ్రామ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల గ్రామ సంఘాల విఓఏలు, విఓ పాలకవర్గ సభ్యులు కలిసి నూతన ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించారు .అలాగే ఇందిర మహిళ శక్తి పథకం ద్వారా చీరలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ఎపియం మల్లేశం, సీసీ మరియా, కమల, స్వరూప, పంచాయతీ సెక్రెటరీలు, విఓఏలు, విఓ అధ్యక్షులు, గ్రామ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.