navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 4:12 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఉచిత శస్త్ర చికిత్స సేవలు ప్రజల వినియోగించుకోవాలి

నవగీతం,నిర్మల్

హైదరాబాద్‌లోని ఆకార్ ఆశా హాస్పిటల్ ద్వారా అందిస్తున్న ఉచిత పునర్నిర్మాణ శస్త్ర చికిత్స సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
బుధవారం కలెక్టరేట్‌లో హాస్పిటల్ వైద్యులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలసి సేవల వివరాలు తెలియజేయగా, ఉచిత శస్త్ర చికిత్సలకు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. చికిత్సతో పాటు ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన బాధితులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. రాజేందర్, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.