navageetam.com
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 1:10 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఉపాధ్యాయున్ని సన్మానించిన కలెక్టర్

నవగీతం,జగిత్యాల:

దక్షిణభారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో రెండవ స్థానం సాధించిన ఉపాధ్యాయుని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సన్మానించారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 23 వరకు నిర్వహించిన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జగిత్యాల జిల్లా రాయికల్ మండల కుమ్మరి పెల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న కడకుంట్ల అభయ్ రాజ్ తయారుచేసిన సూపర్ సైన్స్ కిట్ ఉపాధ్యాయ బోధనోపకరణాల విభాగంలో ప్రదర్శనకు ద్వితీయ బహుమతి లభించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్ అభయ్ రాజును అభినందించారు. ఈ 1కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిన్ పెల్లి ఆనంద్ రావు యాళ్ళ అమర్నాథ్ రెడ్డి రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు పొన్నం రమేష్, రాయికల్ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంతడుపుల గంగరాజం, రాపర్తి నర్సయ్య, జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ పాల్గొన్నారు.