navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 9:35 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలలో జనసేన పోటీకి సిద్దాం.

నవగీతం,కరీంనగర్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలలో పోటీకి సిద్ధమైన జనసేన పార్టీ జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ఆర్ కె. సాగర్ పత్రికా సమావేశం మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సారి జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని అన్ని మున్సిపాలిటీల్లో పోటీకి సిద్ధంగా ఉందని తెలిపారు. యువరక్తం ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలని అప్పుడే నవసమాజ నిర్మాణం ఉంటుందన్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీలో చాలా మంది కొత్త వ్యక్తులను పార్టీ లోకి జనసేన కండువా కప్పి ఆహ్వానించారు. జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.