navageetam.com
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 12:13 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

నవగీతం,కొడిమ్యాల:

కొడిమ్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమాన్ని కొడిమ్యాల మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, కొడిమ్యాల గ్రామ ఉపసర్పంచ్ గుర్రం నర్సయ్య ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గజ్జెల కరుణాచారి, మండల బీసీ సెల్ అధ్యక్షులు, కొడిమ్యాల గ్రామ 5.వ వార్డు మెంబర్ రాపర్తి నర్సింగారావు, మండల బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి దోపతి సత్యం, కొడిమ్యాల గ్రామ అధ్యక్షులు కట్టేకోల రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. అలాగే అంకం జనార్దన్, గడ్డమీది గంగయ్య, కొండ అనిల్, వేములవాడ సతయ్య, వడ్లకొండ హన్మండ్లు, బోగ గణేష్, వేముల రవి, చెన్న దేవయ్య, సురేష్, సంపూనూరి ఆంజనేయులు, చెట్టిపెల్లి గణేష్, సతీష్, నరేష్ తదితర పార్టీ నాయకులు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.