navageetam.com
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 3:11 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఎన్టీఆర్ హయాంలోనే అన్ని వర్గాల సమగ్ర అభివృద్ది

టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి

జిల్లా అభిమాన సంఘం నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్

నవగీతం,పెద్దపల్లి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సర్వజనుల అభివృద్దికి కృషి చేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ కు దక్కిందని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి,ఎన్టీఆర్ అభిమాన సంఘం జిల్లా నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ అన్నారు.అదివారం ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి దేవాలయం చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో వారు ఎన్టీఅర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళీ అర్పించారు.ఈ సందర్భంగా టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా మహిళలలు 33 శాతం రిజర్వేషన్లు,బీసిలకు రిజర్వేషన్లు, నిరుపేదలకు రూపాయికి కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ఇళ్ళు, మహిళలకు ఆస్తిలో హక్కు వంటి విప్లవాత్మకమైన పథకాలను అమలు పరిచి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేశారని గుర్తు చేశారు.ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అటు నటన రంగంలో అత్యున్నత స్థాయిని అందుకొని నేటి తరానికి చెందిన యువ కథానాయకులకు స్పూర్థిగా నిలిచిన ఎన్టీఆర్ చూపించిన మార్గం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.ఆయన మరణించి 29యేళ్ళు గడుస్తున్నా నేటికి ఆయన ఆలోచన విధానాలు కొనసాగడం గొప్ప విషయమని కీర్తించారు.రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి రికార్డు నెలకొల్పిన ఘనత ఎన్టీఆర్ కు దక్కిందన్నారు.ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారతరత్న అవార్డును ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ భూతగడ్డ సంపత్, కనగర్తి సర్పంచ్ ఎడవల్లి శంకర్,తూముల శ్రీనివాస్, గోపి,శ్రీపతి ప్రభాకర్, బూత్కూరి నర్సింగు, మహమ్మద్ సలీం,ఆసిఫ్,కలువల శంకర్,పాల గోపాల్,దేవరకొండ రాజు,నక్క సంతోష్,ముక్కెర రాజేశం,ఎన్టీఆర్ అభిమానులు, తదితరులు పాల్గోన్నారు.