నవగీతం,కోరుట్ల
కోరుట్ల పట్టణ 22వ వార్డుకు చెందిన 30 మంది యువకులు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ కేసీఆర్ వల్లే తెలంగాణ అభివృద్ధి అవుతుందని కెసిఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందని వారి అడుగుజాడలో బిఆర్ఎస్ పార్టీ కొసం వచ్చే మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పార్టీలోకి వచ్చిన యువకులకు కండువాలు కప్పి హృదయపూర్వకంగా ఆహ్వానించారు