ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అగ్నిప్రమాద బాధితులు

నవగీతం, కోడీమ్యాల జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులోని బస్టాండ్ ముందు ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహం సమీపంలో గతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా బొమ్మల వ్యాపారుల దుకాణాలు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జీవనాధారం కోల్పోయిన దుకాణాల యజమానులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు.ఈ సహాయం అందించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు బాధితులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు...