navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 January 2026, 2:47 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఐద్వా ముగ్గుతో జాతీయ మహాసభల ప్రచారం

నవగీతం,వైరా:

జనవరి 25 నుంచి 28 వరకు హైదరాబాదులో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత ఐద్వా సింబల్ తో ముగ్గులు వేసి ప్రచారం చేశారు. ఆకర్షణీయంగా పలు రకాల రంగులతో వేసిన ఐద్వా సింబల్ ముగ్గు చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత మాట్లాడుతూ జనవరి 25న హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగే బహిరంగ సభలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.