navageetam.com
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 2:08 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఓపెన్ జిమ్ ఏర్పాటుకు కృషి చేస్తా: సర్పంచ్ కాడారి మల్లేశం

నవగీతం, కొడిమ్యాల

కొడిమ్యాల మండలం పూడూరు గ్రామ ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా యువత శారీరక దృఢత్వం పెంపొందించుకునే ఉద్దేశంతో గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని గ్రామ యువత గ్రామ పంచాయతీ సర్పంచ్ కాడారి మల్లేశం , ఉప సర్పంచ్.ఎడమల పెళ్లి సంతోష్ లకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ యువత ప్రతినిధులు మాట్లాడుతూ, ఓపెన్ జిమ్ ఏర్పాటుతో యువతతో పాటు పెద్దలు, వృద్ధులు కూడా వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండే అవకాశం కలుగుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన సర్పంచ్, ఉప సర్పంచ్‌లు గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే చర్యలు చేపట్టి, కొద్ది కాలంలో గ్రామంలో రెండు ప్రాంతాల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువత సభ్యులు కవ్వం మధు, ఎగుర్ల నరేష్, మాణిక్యం ప్రసూన్ గౌడ్, గడ్డమీది భరత్, ఎగుర్ల జగదీశ్, మహమ్మద్ షాబుద్దీన్, గొల్ల రాజు, హేమంత్, మహేష్ తదితరులు పాల్గొని గ్రామ అభివృద్ధిపై తమ సహకారం అందిస్తామని తెలిపారు.