navageetam.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 5:44 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కమల నిలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

నవగీతం,జగిత్యాల:

జగిత్యాల నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయం “కమలనిలయం” లో77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డా. శ్రావణి మాట్లాడుతూ భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలని అన్నారు. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదిగేందుకు పునాది వేసిన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం.

కమల నిలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన బిజెపి నాయకులు

మన రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని.ఈ ఏడాది వేడుకలు కేవలం సైనిక శక్తిని మాత్రమే కాకుండా, ‘వందేమాతరం’ ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని, ‘ఆత్మనిర్భర్ భారత్’ ద్వారా మన భవిష్యత్తు లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుంది అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్,జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్ జిల్లా మండల పట్టణ పదాధికారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.