navageetam.com
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 8:37 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కలెక్టరేట్ లో ఓబన్న జయంతి వేడుకలు

నవగీతం,జగిత్యాల

జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరెట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వాతంత్ర్య సమర యోధులు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,అదనపు కలెక్టర్ రాజా గౌడ్ పాల్గొని వారి చిత్ర పటానికి పూలు సమర్పించి, ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ ,రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు వల్లెపు మొగిలి ,వడ్డెర నాయకులు బాపి రాజు,గంగాధర్, మల్లేశం నక్కల, కప్పల శ్రీకాంత్, ప్రవీణ్,వడ్డెర సంఘం నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.