navageetam.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 2:42 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కలెక్టర్ అనుదీప్ ను కలిసిన సిరిపురం కేజీ గ్రామస్తులు

రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తా కలెక్టర్ హామీ

నవగీతం,వైరా

వైరా మండలం సిరిపురం కేజీ లో అనుమతులు లేకుండా సెల్ టవర్ నివాస గృహాల మధ్య నిర్మాణం చేపట్టారు. గ్రామ ప్రజలు సెల్ టవర్ నిర్మాణానికి నిరాకరించి నిర్మాణాన్ని నిలిపివేయాలని పలుమార్లు నిరసన తెలిపారు. ఏమి పట్టినట్టుగా సెల్ టవర్ నిర్మాణం చేపట్టారు.గ్రామస్తులు ఆగ్రహంతో సెల్ టవర్ నిర్మాణం కోసం తీసిన గుంటలో దిగి నిరసన తెలిపారు అనంతరం స్థానిక ఎస్సై పుష్పాల రామారావు వచ్చి స్థానికులకు నచ్చచెప్పి నిర్మాణ పనుల్ని ఆపారు. అనంతరం గ్రామస్తులు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ని కలిసి వారి గోడుని వెలబుచ్చుకున్నారు అనంతరం కలెక్టర్ స్థానిక తాసిల్దార్ కి  అధికారులకు ఫోన్లో తక్షణమే సెల్ టవర్ స్థలాన్ని మార్చండి అంటూ ఆదేశాలు ఇచ్చారు. గ్రామస్తులు కలెక్టర్ మాట విన్న వెంటనే చాలా ఆనందపడ్డారు. ఈ కార్యక్రమంలో కామినేని శ్రీనివాసరావు, మొరంపూడి మధు, దుప్పటి గోపి, బండ్ల అశోక్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు