నవగీతం మల్లాపూర్
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుకు కెమిస్ట్రీ ల్యాబ్ లో గ్యాస్ సిలిండర్ అవసరం ఉందని తెలుసుకొని వి.వి.రావు పేట గ్రామానికి చెందిన కళాశాల పూర్వ విద్యార్థి ఆరేళ్లి సంజీవ్ ప్రిన్సిపాల్ బండి సత్యనారాయణ చేతులమీదుగా ల్యాబ్ విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా దాదాపు రూ.4000 ల విలువగల సిలిండర్, పైప్ లైన్ కనెక్షన్ బర్నర్స్ అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బండి సత్యనారాయణ ఆరేళ్లి సంజీవ్ , అధ్యాపకులు నంచర్ల రాజేష్ ముద్ధం సత్యనారాయణ,వేముల సత్యనారాయణ,పి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు