navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 12:14 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కళ్యాణ లక్ష్మి ,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే

నవగీతం, మెట్ పల్లి

మెట్‌పల్లి పట్టణంలోని విధిత్ రెడ్డి గార్డెన్స్ లో మెట్‌పల్లి పట్టణం, మెట్‌పల్లి రూరల్ కు చెందిన 72 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ పథకాల కింద రూ.72,08,352/- విలువగల చెక్కులను అదేవిధంగా ఇబ్రహీంపట్నం,మెట్ పల్లి మండలం మరియు మెట్ పల్లి పట్టణనికి చెందిన 56 మంది లబ్ధిదారులకు రూ.14,88,000/- విలువగల 56 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో అమలైన సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను వివరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే పనిచేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేదని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు, అధికారులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.